సమంత.. ఎప్పటికి మెరిసే బంగారమే..!

gossips, news, telugu, tollywoodLeave a Comment

12 ఏళ్ల కెరియర్ లో తన ఫాం ఎప్పుడూ కోల్పోని సమంత ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. కెరియర్ లో ఆమెకు ఎదురైన ప్రతి క్లిష్ట పరిస్థితిని దాటుకుంటూ ఆమె సక్సెస్ బాటలో నడిచింది. సక్సెస్ లో ఉన్నప్పుడు వరుస అవకాశాలు రావడం కామన్ కానీ ఫెయిల్యూర్ లో కూడా ఛాన్సులు రాబట్టుకోగలడం చాలా ముఖ్యం.

స్టార్ హీరోయిన్ గా మంచి హిట్లు పడిన తర్వాత ఒకసారిగా సమంత కెరియర్ సందిగ్ధంలో పడ్డది. దాదాపు కెరియర్ ముగిసింది అనుకునేలోగా మళ్లీ తన నటనతో సత్తా చాటింది. అంతేకాదు నాగ చైతన్యతో లవ్ మ్యారేజ్ కూడా ఆమె కెరియర్ కు ఓ అడ్డుకట్ట వేసింది. పెళ్లైనా సినిమాలు చేస్తూ వచ్చిన సాం.. చైతుతో దూరమయ్యాక తన ఫుల్ ఫోకస్ సినిమాల మీదే పెట్టింది.

కెరియర్ లో రెండు అడుగులు వెనక్క పడ్డ ప్రతిసారి రెట్టింపు వేగంతో మరింత ముందుకు వస్తుంది సమంత. లేటెస్ట్ గా ఆమె చేస్తున్న యశోద గ్లింప్స్ వీడియో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది చూసిన ప్రేక్షకులకు సమంత స్క్రీన్ ప్రెజెన్స్ చూసి వావ్ అనేస్తున్నారు.

Also Read  Badshah's rocking song

హీరోయిన్స్ విషయంలో కొన్ని వార్తలు వారి కెరియర్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి. ముఖ్యంగా మ్యారేజ్, డైవర్స్ లాంటి వార్తలతో హీరోయిన్స్ ని ఓ ఆట ఆడుకుంటారు. కానీ వారందరికి తన సినిమాలతోనే సమాధానం చెబుతుంది సమంత. అందుకే ఎవరేం మాట్లాడినా వారికి సమాధానం గా నీ పనితనం ఉండాలని ఎవరో చెప్పినట్టుగా సమంత తన మీద వస్తున్న.. రాస్తున్న వార్తలన్నిటికీ తన యాక్షన్ తోనే సమాధానం ఇస్తుంది.

The post సమంత.. ఎప్పటికి మెరిసే బంగారమే..! appeared first on mirchi9.com.

Leave a Reply

Your email address will not be published.