యాంకర్ సుమ.. ఇది మార్చుకోవాల్సిందే..!

gossips, news, telugu, tollywoodLeave a Comment

స్మాల్ స్క్రీన్ పై యాంకర్ సుమ సందడి మాములుగా ఉండడు. దాదాపు రెండు దశాబ్ధాల నుండి యాంకర్ గా బుల్లితెర మీద తన సత్తా చాటుతుంది సుమ కనకాల. ఛానెల్ ఏదైనా.. షో ఏదైనా.. సుమ హోస్ట్ చేస్తే సక్సెస్ అయి తీరాల్సిందే. తెలుగు రియాలిటీ గేమ్ షోస్ తో సుమ సూపర్ క్రేజ్ తెచ్చింది. కేవలం స్క్రిప్ట్ ఇస్తే చదవడం కాకుండా తన సొంత ఐడియాతో యాంకరింగ్ చేస్తూ ఆడియెన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్ ఇస్తుంది.

ఇన్నేళ్ల సుమ యాంకరింగ్ సూపర్ అన్న వారే తప్ప ఆమెని వేలెత్తి చూపించిన వారు లేరు. స్టార్స్ తో పాటుగా ఆడియెన్స్ ని ఎప్పటికప్పుడు అలరిస్తూ తన యాంకరింగ్ టాలెంట్ చూపిస్తుంది సుమ. అయితే హోస్ట్ గా చేస్తూ చేస్తూ వచ్చిన సుమ ఈమధ్య ఎందుకో రొటీన్ గా అనిపించేస్తుంది. అదే కుళ్లు జోకులు.. రొటీన్ పంచులతో ఆమె యాంకరింగ్ కొనసాగుతుంది. కొత్తగా ఏమి చేయట్లేదని ఆడియెన్స్ నుండి కంప్లైంట్స్ వస్తున్నాయి.

Also Read  GENIUS Movie Review First on Net - AtoZpuLse

యాంకరింగ్ లో అనుభవంతో తన మీద తనకు వచ్చిన నమ్మకం కావొచ్చు తనకు తానుగా పొగిడేసుకోవడం జరుగుతుంది. ఇది చాలా ఎక్కువ అయ్యిందని ఈమధ్య ఈవెంట్స్ లో సుమ యాంకరింగ్ చూస్తే అర్ధమవుతుంది. అంతేకాదు కొత్త దర్శకులు, హీరోయిన్స్ ని ఆమె తీసిపడేసినట్టు మాట్లాడేస్తుంది. ఈమధ్య ఓ సినిమా ఈవెంట్ లో డైరక్టర్ మాట్లాడుతుంటే ఆమె మైక్ లాగేసుకోవడం లాంటివి ఇందుకు ఉదహరణగా చెప్పుకోవచ్చు.

అందరిలా కాకుండా తనకంటూ ఒక యూనిక్ స్టైల్ ఏర్పరచుకున్న సుమ ఈమధ్య రొటీన్ గా అనిపిస్తుంది. దీనితోడు నిన్న జరిగిన మహేష్ సర్కారు వారి పాట ఈవెంట్ లో తన AV వేయించుకోవడం లాంటిది కొద్దిగా ఓవర్ అనిపించేసింది. అంతేకాదు ఆ ఈవెంట్ లో కూడా సుమ యాంకరింగ్ చాలా బోర్ కొట్టేసింది. కెరియర్ ఫస్ట్ టైం సుమ యాంకరింగ్ మీద నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా సుమ ఇది మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలాంటి హంగులు.. ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా ఇదివరకు సుమలా యాంకరింగ్ చేస్తే చాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

The post యాంకర్ సుమ.. ఇది మార్చుకోవాల్సిందే..! appeared first on mirchi9.com.

Leave a Reply

Your email address will not be published.