బాబుని బ్లేమ్ చేయడం ఏందయ్యా.. మీ బొంద..!

gossips, news, telugu, tollywoodLeave a Comment

మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో డైలాగ్ ఉంది కదా.. సినిమా హిట్టైతే మన ఖాతాలోకి.. లేదంటే అవతల వాడి ఖాతాలోకి అని.. అలానే ఉంది కొందరి మెగా వీరాభిమానుల వెర్రితనం. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మెగా బీభత్సం సృష్టిస్తుంది.. బాహుబలి, నాన్ బాహుబలి రికార్డులన్ని సైడ్ అవ్వాల్సిందే అని నానా హడావిడి చేసి వచ్చిన ఆచార్య కాస్త తుస్సుమనిపించింది. సినిమా లో మ్యాటర్ లేదని మొదటి ఆటకే ప్రేక్షకులు రిజల్ట్ డిసైడ్ చేసేశారు.

ఎంతైనా చిరంజీవి, రాం చరణ్ కలిసి నటించిన ఫుల్ లెంగ్త్ మూవీ.. ఊహించిన విధంగా కలక్షన్స్ లేకపోయేసరికి మెగా అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. ఇక సినిమా ఫెయిల్యూర్ ని ఎవరి ఖాతాలో వేయాలా అని ఆలోచిస్తున్న టైం లో సినిమా మొదట్లో వచ్చే మహేష్ వాయిస్ ఓవర్ గుర్తుకొచ్చింది. అదిగో అక్కడే వెర్రాభిమానం.. సారీ సారీ వీరాభిమానం బయటకు వచ్చేసింది. ఆచార్య ఫెయిల్యూర్ కి మహేష్ వాయిస్ ఓవరే కారణం అని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

Also Read  In Pics: Curvaceous Ileana!

అంతేకాదు ఆచార్య చిరంజీవి, రాం చరణ్ కెరియర్ లోనే కాదు మహేష్ కెరియర్ లో కూడా అతి పెద్ద ఫ్లాప్ అని ట్వీట్స్ చేయడం మొదలు పెట్టారు. చిరు మీద అభిమానంతో మారు మాట్లాడకుండా మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తే.. మెగా అభిమానులు మాత్రం ఆచార్య ఫెయిల్యూర్ కి మహేష్ కి లింక్ పెట్టేస్తున్నారు. అయితే ట్విట్టర్ లో మెగా ఫ్యాన్స్ చేస్తున్న ఈ కామెంట్స్ కు మహేష్ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో కౌంటర్స్ వేస్తున్నారు.

ఆచార్యలో మహేష్ వాయిస్ ఓవర్ ఉంది కాబట్టే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా సినిమా చూసేందుకు వచ్చారని అదే లేకపోతే ఇప్పుడున్న కలక్షన్స్ లో సగం పడిపోయేవని కామెంట్ చేస్తున్నారు. హీరోలు బాగున్నా అభిమానుల వెర్రి ఇలాంటి పనులకు దారి తీస్తుంది. ఆచార్య ఎందుకు ఫెయిల్యూర్ అయింది అన్నది అందరికి తెలిసిందే. దానికి వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ మీద నింద వేస్తూ మెగా అభిమానులు చేస్తున్న ట్రోల్స్ కి మహేష్ ఫ్యాన్స్ కూడా ధీటుగా సమాధానం చెబుతున్నారు.

The post బాబుని బ్లేమ్ చేయడం ఏందయ్యా.. మీ బొంద..! appeared first on mirchi9.com.

Leave a Reply

Your email address will not be published.