పవన్ తో నా రిలేషన్ కి అదే ప్రతీక: అలీ

adminexclusive; hotspot, hotspot, telugu, tollywoodLeave a Comment


హైదరాబాద్: పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు కమెడియన్ అలీ అనే సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి అలీ మరోసారి చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ…కెమెరామెన్‌ గంగతో రాంబాబు టైమ్‌లోనూ గంగ నేనే అనుకున్నారు. కానీ గంగ అమ్మాయి అని తర్వాత అందరికీ తెలిసింది. 

అది మా రిలేషన్‌కి ప్రతీక.. అని తెలిపారు. అలీ హీరోగా నటించిన 50వ చిత్రం ‘ఆలీబాబా ఒక్కడే దొంగ’. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా అలీ హైదరాబాద్‌లో విలేకర్ల మీడియాతో మాట్లాడారు. పవన్ తో తన అనుబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

“పవన్‌కల్యాణ్ ఇప్పటివరకూ 19 సినిమాలు చేస్తే 17 సినిమాల్లో నేను నటించాను. ఆయన కొంతమందితోనే బాగా దగ్గరవుతాడు. అలా దగ్గరైనవాళ్లలో నేనూ ఒకణ్ణి. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రతిసారీ వర్కవుట్ అవడం ఆనందకరం” అని చెప్పారు అలీ.
Also Read  Sarkaru Vaari Paata title song failed to reach the expectations

Leave a Reply

Your email address will not be published.