ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొంటున్న అనేక నిర్ణయాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్‌ను ఎక్కువగా దెబ్బ తీసింది మూడు రాజధానుల ప్రతిపాదన అని చెప్పక తప్పదు.
టిడిపిపై రాజకీయ కక్షతో అమరావతి నిర్మాణాలను గాలికి వదిలేసి వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ చాలా విచిత్రమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దానిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా, కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా పట్టించుకోలేదు..ఓకే! కానీ మూడేళ్ళలో కనీసం ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయలేకపోయింది?
ఈ మూడు రాజధానుల తిక్క ఆలోచనతో రాష్ట్రానికి జరిగిన నష్టం అంతా ఇంకా కాదు. రాష్ట్రంలో ఈ రాద్దాంతాన్ని చూసి పెట్టుబడులు, జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు అన్నీ పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రానికి తరలిపోయాయి. ఈ మూడేళ్ళలోనే తెలంగాణ రాష్ట్రం సుమారు రూ.40-50, 000 లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించగలిగిందంటే అది మన వైసీపీ ప్రభుత్వం చలవే కదా?
ఒకవేళ వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అమరావతిలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న నిర్మాణ పనులను కొనసాగించి ఉంటే అది చూసి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు రాష్ట్రానికి వచ్చి ఉండేవి కదా?తెలంగాణకు పోయిన ఆ లక్షల కోట్ల పెట్టుబడులలో కనీసం సగమైనా ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి ఉండేవి కదా?అప్పుడు ఏపీలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు కదా?
అమరావతి నిర్మాణ పనులు కొనసాగించకుండా మూడేళ్ళు నిలిపివేయడం వలన గత ప్రభుత్వ శ్రమ, దాని కోసం ఖర్చు చేసిన వేలకోట్ల డబ్బు, ఈ మూడేళ్ళ విలువైన కాలం అన్నీ వృధా అయిపోయాయి. హైకోర్టు మళ్ళీ మొట్టికాయలు వేసిన తరువాత ఇప్పుడు అయిష్టంగానైనా అమరావతి నిర్మాణపనులు మొదలుపెట్టాల్సి వచ్చింది.
కానీ ఇప్పుడు కూడా రాజధాని నిర్మాణానికి మరో ఆరేళ్ళు పడుతుందని వైసీపీ ప్రభుత్వం చెపుతుంటే హతవిధీ…! అనుకోక తప్పదు. అంతవరకు రాష్ట్రం ఇంకా ఎంత నష్టపోతుందో బహుశః ఎవరూ లెక్కకట్టలేరేమో?
పాలకులు రాజకీయ కారణాలతో నిర్ణయాలు తీసుకొంటే రాష్ట్రం ఎంతగా, ఏవిదంగా నష్టపోతుందో తెలుసుకొనేందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష నిదర్శనంగా కళ్ళ ముందుంది.
Jagan Can’t Complete Full Term?
Fans Are The Real Reason For NTR’s Embarrassment
The post ఒక పెద్ద తప్పు…ఏపీకి తీరని నష్టం appeared first on mirchi9.com.