షెర్లిన్ చోప్రాపై దర్శకుడి పరువునష్టం దావా : Court Notice to Sherlyn chopra

adminbollywood, gossips, hotspotLeave a Comment

కామసూత్ర 3డి చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాపై ఆ చిత్ర దర్శకుడు రూపేష్ పాల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో ఆమె తనను తిట్టిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎర్నాకులం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆయన తన ఫిర్యాదు దాఖలు చేశారు. షెర్లిన్ చోప్రా తన ట్విట్టర్ అకౌంట్ లో తనను తిట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ కేసు తదుపరి విచారణకు కోర్టు మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది.

జనవరి 15వ తేదీన ఆమె తన ట్విట్టర్ లో తనను నేరుగా అసభ్యంగా తిట్టిందని, అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసిందని పాల్ చెప్పారు. పాల్ తనకు ఈ చిత్రంలో నటించినందుకు మొత్తం ఇవ్వాల్సిన పారితోషికంలో రూ. 7 లక్షలు ఇవ్వలేదని ఇంతకుముందు షెర్లిన్ చోప్రా ముంబైలోని ఓ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు దాఖలుచేసింది. అతడి లైంగిక వాంఛలు తీర్చకపోవడంతో కామసూత్ర 3డి చిత్రానికి సంబంధించిన మిగిలిన మొత్తం ఇచ్చేది లేదని కూడా పాల్ తనను బెదిరించినట్లు షెర్లిన్ ఆరోపించింది.

Also Read  Ram Charan hosts ‘Langar Seva’ at Golden Temple

Leave a Reply

Your email address will not be published.