రోజుకు కోటివ్వండి : 1 crore per day

adminbollywood, gossips, hotspotLeave a Comment

ఇళయదళపతికి జంటగా నటించాలంటే రోజుకు కోటివ్వాలంటోందట బాలీ వుడ్ క్రేజీ భామ దీపికా పదుకునే. అంతేకాదు ఓకే అంటే చెప్పండి ఎన్ని కాల్‌షీట్స్ అయినా ఇస్తానంటోందట ఈ గుమ్మ. జిల్లా తరువాత విజయ్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవ ల ప్రారంభమైంది. అయితే విజయ్ దీంతోపాటు మరో దర్శకుడు శింబుదేవన్ దర్శకత్వంలో నటించనున్నారు. ఫాంటసీ కథాం శంతో కూడిన ఈ చిత్రం హీరోయిన్‌గా దీపికా పదుకునేను నటింప చేసే ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నటించడానికి తనకభ్యంతరం లేదని అయితే పారి తోషికం మాత్రం రోజుకు కోటి రూపాయలు చొప్పున చెల్లించాలని దీపికాపదుకునే బదులిచ్చిం దట. 
 
 ఇందుకు ఓకే అంటే ఎన్ని కాల్‌షీట్స్ అయినా కేటాయించడానికి సిద్ధమని చెప్పిందట. రోజుకు కోటి చొప్పున లెక్కేస్తే దీపికా పదుకునే పారితోషికం హీరో విజయ్ పారితోషికాన్ని మించుతుందట. దీంతో పారితోషికం తగ్గించే విషయమై ఆమెతో నిర్మాతల వర్గం చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఈ ఉత్తరాది బ్యూటీ సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన కోచ్చడయాన్ చిత్రంలో నటించడానికి 3 కోట్లు పారితోషికం మాత్రమే తీసుకుందట. మరి ఇళయదళపతితో నటించడానికి రోజుకు కోటి డిమాండ్ చేయడంతో ఆమె లెక్కేమిటోనంటున్నాయి కోలీవుడ్ వర్గాలు
Also Read  Mandira Bedi shares pool pic with a mystery man, gets trolled

Leave a Reply

Your email address will not be published.